హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఇంట్లో ఓ పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరడుగుల పొడవున్న పాము ఇంటిపరిసరాల్లో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

 హైదరాబాద్ సీపీగా ఇటీవల నియమితులైన అంజనీ కుమార్ అంబర్ పేటలో నివాసముంటారు. అయితే ఈయన కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటి గేట్ ముందు 6 అరుడుగల జెర్రీ పోతు సంచరిస్తుండగా గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో వీరు హుస్సేనీ అలం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న నాయక్ కు సమాచారం అందించారు.నాయక్ వచ్చి పాము ను పట్టుకుని స్నేక్ సొసైటీ కి తరలించాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.