ఏపి ఎమ్మెల్యే కార్యాలయంలో విష సర్పం

ఏపి ఎమ్మెల్యే కార్యాలయంలో విష సర్పం

అది సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం. అదీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందింది. దీంతో అతడి కార్యాలయానికి నియోజకవర్గ ప్రజలు అనేక పనుల కోసం వస్తుంటారు.  అయితే ఈ కార్యాలయంలో  పనులు జరగడం మాట అటుంచి వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అతడి కార్యాలయంలో అంత ప్రమాదకర ఘటన ఏం జరిగింందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి. 

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్య బోడె ప్రసాద్  కార్యాలయంలో విష సర్పాలు కలకలం సృష్టిస్తున్నాయి.  కొద్దిరోజుల క్రితం ఈ కార్యాలయంలో తాచుపాము కలకలం రేపగా, ఆ తర్వాత ఓ జెర్రిపోతు పాము కార్యాలయంలోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. తాజాగా నిన్న మద్యాహ్నం సమయంలో ఓ కట్ల పాము కార్యాలయం వద్ద ప్రత్యక్షమైంది. ఇలా పాములు ఎమ్మెల్యే కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ పనుల కోసం వచ్చిన సామాన్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రవేశించిన కట్ల పామును పట్టుకోడానిక ప్రయత్నించిన అంకాలు అనే వ్యక్తి ని కాటేసింది. ఈ కాటుకు భయపడకుండా అతడు పామును పట్టుకుని చంపేశాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి పాము కాటుకు వైద్యం చేయించుకున్నాడు.
 
ఇలా తరచూ విష సర్పాలు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యక్షమవుతుండడంతో వివిధ పనులపై  కార్యాలయానికి వచ్చేవారితో పాటు, కార్యాలయ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos