Asianet News TeluguAsianet News Telugu

సక్సెస్ ఫుల్ మ్యారేజ్ కి ఐదు సూత్రాలు

  • మ్యారేజీ లైఫ్ ని హ్యాపీగా గడపాలంటే ఏమి చేయాలి అని అనుకుంటున్నారా.
Six point formula for successful marriage

మూడుముళ్లు, ఏడు అడుగులతో ఏర్పడుతుంది పెళ్లి బంధం. పెళ్లయిన తొలి రోజుల్లో భార్యభర్తలిద్దరూ ఒకరితో మరొకరు ప్రేమగానే ఉంటారు. ఒకరి కోసం మరొకరు సమయం కేటాయిస్తూ సరదాగా గడిపేస్తారు. ఆ తర్వాతే మొదలౌతుంది అసలు సమస్య. ఒకరి కోసం మరొకరికి సమయం కేటాయించడం కుదరదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలౌతాయి. చిన్న సమస్య కూడా పెద్దదిగా కనపడుతుంది.  జీవితాంతం ఈ వ్యక్తితో ఎలా ఉండాలి అనే ప్రశ్నకూడా మొదలౌతుంది. చివరికి విడాకులకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ సమస్యలకు పరిష్కారం లేదా..? మ్యారేజీ లైఫ్ ని హ్యాపీ గడపాలంటే ఏమి చేయాలి అని అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయండి..

మీ జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా గడపాలని మీరు అనుకుంటే.. వారు మీకు ఎంత ముఖ్యమో మీరు తెలియజేయాలి. చాలా మంది వారి ఫీలింగ్స్ ని వారిలోనే దాచుకుంటుంటారు. అలా కాకుండా ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పండి. వాళ్లు మీ పక్కన లేనప్పుడు వాళ్లని ఎంత మిస్ అవుతున్నారో తెలియజేస్తూ ఉండండి.

లవ్ మెసేజీలు..

పెళ్లి కుదరిన తర్వాత చాలా మంది ఫోన్లలో చాటింగ్ లు చేసుకుంటూనే ఉంటారు. అందులో ప్రేమ సందేశాలకు కూడా చోటు ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత వీటిని పూర్తిగా తగ్గించేస్తారు. అలా చేయడం కరెక్ట్ కాదు. మీ ప్రేమను   మీ పార్టనర్ కి మెసేజ్ ల ద్వారా తెలియజేస్తూ ఉండండి.

కౌగిలింత..

కొన్ని మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ ని కౌగిలింతతో చెప్పవచ్చు అంటారు నిపుణులు. కాబట్టి ప్రతి రోజు కనీసం 20నిమిషాల పాటు మీ పార్టనర్ ని హగ్ చేసుకుంటే.. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరు కలిసి బయటకు వెళ్లినప్పుడు ఒకరి చేతిని మరొకరు పట్టుకోండి.

కాంప్లిమెంట్స్..

ఒక మెచ్చుకోలు.. ఎంతో తృప్తిని ఇస్తుంది. వాళ్లు మీకోసం ఏదైనా చేసినా, అందంగా రెడీ అయినా.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం లాంటివి చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది.

నిజాయితీ..

అంతేకాదు.. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మీదే బంధాలు నిలబడతాయి అన్న విషయం గుర్తించుకోవాలి. అదేవిధంగా మీ భాగస్వామి చేసే కొన్ని పొరపాట్లను మీరు మన్నించగలగాలి.

ఈ పై సూత్రాలన్నీ ఫాలో అయితే.. హ్యాపీ లైఫ్ మీ సొంతం.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios