సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి

First Published 1, Oct 2017, 10:49 AM IST
six killed when bus rammed into a truck near suryapet Telangana
Highlights

ఆగి ఉన్న ట్రక్కును ఆర్టీసీ బస్సు ఢీ కొంది

 

తెలంగాణ  సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెర్వు వద్ద జాతీయ రహదారి 65 పై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఆగి ఉన్న ఒక లారీని ఆర్టీసు బస్సు డి కొట్టడంతో జరిగిన  ఈ ప్రమాదంలో ఆరుగరు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న అవనిగడ్డ డిపో బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి, కోదాడ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. కృష్ణా జిల్లా కోసూరుకు చెందిన రమాదేవి, పెద్దకూడి సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందిన వారిలో పేర్లు సత్తయ్య, వేముల ఏడుకొండలు, వరప్రసాద్‌ (డ్రైవర్)  లని చెబుతున్నారు. గాయపడిన వారికి సూర్యాపేటఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

loader