జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీని 15 రోజుల్లో ఒక్కసారి మాత్రమే ఎవరైనా కలవాలి. అది కూడా పోలీసుల పర్యవేక్షణలో కానీ, శశికళను 31 రోజుల్లో 28 మంది 14 సార్లు కలిశారు.  

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి కర్నాటక జైల్లో ఊచలు లెక్కపెడుతున్నా చిన్నమ్మ అధికారానికి అడ్డే లేకుండాపోయింది. కటకటాల మద్యనుంచే ఆమె రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నారో తెలిపే ఆధారం ఒకటి బయటపడింది. ఓ సమాచార కార్యకర్త ఆర్టీఐ నిబంధనల మేరకు పొందిన వివరాలను గమనిస్తే మనం నోరెళ్ల బట్టాల్సిందే. శిక్ష అనుభవిస్తున్న శశికళను జైల్లో 31 రోజుల్లో 28 మంది దర్శించుకున్నారట. 14 సందర్భాల్లో చిన్నమ్మ దర్శన భాగ్యం వాళ్లకు లభించిందట. ఇది పూర్తిగా జైలు నిబంధనల ఉల్లంఘనేనని తెలుస్తోంది. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీని 15 రోజుల్లో ఒక్కసారి మాత్రమే ఎవరైనా కలవాలి. అది కూడా పోలీసుల పర్యవేక్షణలో కానీ, శశికళను 31 రోజుల్లో 28 మంది 14 సార్లు కలిశారు. ఈ ఒక్క ఆధారం చాలదూ చిన్నమ్మ జైల్ గిరి గురించి చెప్పడానికి.

http://newsable.asianetnews.tv/video/sitting-in-karnataka-sasikalas-jail-raj-in-tamil-nadu