సూర్యాపేట జిల్లాలో మహిళ దారుణ హత్య

సూర్యాపేట జిల్లాలో మహిళ దారుణ హత్య

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ మహిళపై దుండగులు దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగల చేతిలో దాడికి  గురైన మహిళ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. 

ఈ ఘటనకు పంబంధించిన వివరాలిలాఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ లో బర్మావత్ లక్ష్మి అనే మహిళ ఇవాళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన కొందరు దొంగలు ఈమెను బెదిరించి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అయితే వారిని లక్ష్మి ఎదిరించడంతో ఆమెను తమతో పాటు తెచ్చుకున్న కత్తితో పొడిచి ఇంట్లోని ఏడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దుండగుల కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన లక్ష్మి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos