మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సింగర్(వీడియో)

మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సింగర్(వీడియో)

అసోం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అంగారగ్ పపొన్ మహంత మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కాడు. మ్యూజిక్ రియాలిటీ షో కంటెస్టంట్ (మైనర్ బాలిక)ను పపొన్ మహంత కిస్ చేస్తున్న వీడియో  ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వాయిస్ ఇండియా కిడ్స్ మ్యూజిక్ రియాలిటీ షో కు గాయకులు షాన్, హిమేశ్ రేష్మియా, పపొన్ మహంత న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 

రియాలిటీ షో పార్టిసిపెంట్స్ అంతా కలిసి హోలి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో అందరూ రంగులు చల్లుకున్నారు. అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో సింగర్ పపొన్ మహంత అక్కడికి వెళ్లి మైనర్ బాలిక  ముఖానికి రంగు పూసి, ఆమె పెదాలకు ముద్దు పెట్టాడు. ఈ వీడియో ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవడంతో అంతా షాక్ తిన్నారు. సింగర్ పపొన్ మహంత మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోపై సుప్రీంకోర్టు లాయర్ రున భూషణ్ మాట్లాడుతూ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పపొన్ మహంత పై పోస్కో యాక్ట్ కింద ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రియాలిటీ షోలో పాల్గొనే ఆ బాలిక పట్ల సింగర్ పపొన్ మహంత ప్రవర్తించిన తీరు తమను ఆశ్చర్యానికి గురిచేసిందని లాయర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికకు రక్షణ కల్పించి..ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రియాలిటీ షోల్లో పాల్గొనే చిన్నారులపై ఈ రకమైన వేధింపులు పునరావృతం కాకుండా మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ను కోరారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos