అమరావతి వస్తున్న సింగపూర్ ప్రధాని

అమరావతి వస్తున్న సింగపూర్ ప్రధాని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌత్యం ఫలించింది. సింగపూర్ ప్రధానిని అమరావతి తీసుకురావలన్న ఆయన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.  ఈ నెలలో అమరావతికి విశిష్ట అతిధిగా లీ హ్సీఎన్ లూంగ్  వస్తున్నారు.  సింగపూర్ ప్రధానిని మన అమరావతికి రప్పించాలని చాలా కాలంగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అది ఇపుడు నెరవేరింది. జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనటానికి సింగపూర్ ప్రధాని భారత అతిధిగా వస్తున్నారు . ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు. ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందించారు.

 పోయిన సంవత్సరం సింగపూర్ ప్రధాని అమరావతి రావాల్సి ఉండగా, అది వాయిదా పడింది. ఎట్టకేలకు రిపబ్లిక్ డే సందర్బంగగా సింగపూర్ ప్రధాని అమరావతి రావటానికి మార్గం సుగుమం అయ్యింది. సింగపూర్ ప్రధాని అమరావతి వస్తారు కాబట్టి, ఆయనతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ వస్తారా అనేది ఇంకా స్పస్టం కావడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం  భారత ప్రధాని కూడా రావాలని అంటున్నా దాని మీద క్లారిటీ రావడం లేద. ఎప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ ఆమరావతి  రాలేదు.  అదే విధంగా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదు. ఈ వార్తల నడుమ సింగపూర్ ప్రధానిని వెంబడి మోదీ కూడా వస్తారా? 

 ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినా ప్రధాని మోదీ ‘బిజి’ అని వాయిదా వేస్తూ వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సింగపూర్ ప్రధానే అమరావతి పర్యటన ఖరారు చెయ్యటంతో, ఆయనతో పాటు మోడీ రావాల్సిన పరిస్థితి వస్తున్నదని కూడా కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం మీద క్లారిటీ వచ్చేందుకు  సమయం ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos