Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ కు తొలి మహిళా అధ్యక్షురాలు

  • సింగపూర్ కి మొట్టమొదటి సారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది.
  • అది కూడా ఎలాంటి ఓటింగ్ లేకుండా నే ఆమె ప్రెసిడెంట్ పదివిని అలంకరించారు
  • ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి
Singapore gets 1st woman President without a vote

సింగపూర్ కి మొట్టమొదటి సారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యింది. అది కూడా ఎలాంటి ఓటింగ్ లేకుండా నే ఆమె ప్రెసిడెంట్ పదివిని అలంకరించారు. ముస్లిం మాలే మైనార్టీకి చెందిన హలీమా యాకోబ్ అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హలీమా సింగపూర్ పార్లమెంట్ కి గతంలో స్పీకర్ గా పనిచేశారు. సింగపూర్ చరిత్రలోనే అంత్యంత కీలకమైన నిర్ణయంగా ప్రభుత్వం దీనిని అభిర్ణించింది.

 

 సింగపూర్ ని పది సంవత్సరాలుగా ఒకే పార్టీ నిర్విరామంగా పాలిస్తోంది. దేశాధ్యక్షుని కోసం అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే... అధ్యక్షుని రేసులో ఉన్న నేతలను కాదని ప్రభుత్వం హలీమా ను అధ్యక్షురాలిగా నియమించారు.అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన అధ్యక్ష పదవిని ఎన్నికలు నిర్వహించకుండా ఎలా కట్టబెడతారంటూ చర్చ మొదలైంది. ఎలాంటి అర్హత నియమాలు పాటించకుండానే ఆమెను అధ్యక్షురాలిగా నియమించారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 

ఒకే పార్టీ కొన్ని దశాబ్దాలుగా సింగపూర్‌ను పరిపాలిస్తూ వస్తోంది. పైగా దఫాల వారిగా వివిధ కమ్యూనిటీలకు అధ్యక్ష బాధ్యత అప్పగించే పనులు చేస్తోంది. ఈ సారి మాలే వర్గానికి ఆ బాధ్యతలు అప్పగించాలనుకోవడం, అయితే, ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఎన్నికలు నిర్వహించకుండానే ఏకపక్షంగా హలీమాకు కట్టబెట్టడం అదే వర్గంలోని కొందరికి మింగుడు పడటం లేదు. దీనిపై సోషల్‌ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘ఎన్నికలు లేకుండా ఎన్నికయ్యారు.. ఇదొక హాస్యాస్పదం’ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన హలీమా దాదాపు 20 ఏళ్లుగా అదే పార్టీలో పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios