అందం.. అనగానే అమ్మాయిలే గుర్తుకు వస్తారు. మగవారితో పోలిస్తే.. అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  అమ్మాయిలు అందంగా కనిపించడానికి మన దగ్గర బ్యూటీ టిప్స్ చాలానే ఉన్నాయి. అయితే.. కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా బ్యూటీ టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ బ్యూటీ టిప్స్ కనుక అబ్బాయిలు ఫాలో అయితే.. మోస్ట్ హ్యాండ్ సమ్ బిరుదు మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూసేద్దామా..

స్నానం తర్వాతే షేవ్..

సాధారణంగా అందరూ స్నానం చేయడానికి ముందు షేవ్ చేసుకుంటారు. అయితే.. దానికన్నా.. స్నానం చేసిన తర్వాత షేవ్ చేసుకోవాలి. ఎందుకంటే.. స్నానం తర్వాత షేవ్ చేస్తే.. చాలా స్మూత్ గా.. ఎలాంటి గాయాలు కాకుండా షేవ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే.. ఆ తర్వాత మళ్లీ స్నానం చేయవచ్చు.

కండిషనర్+షేవింగ్ క్రీమ్..

షేవింగ్ తర్వాత గడ్డం చాలా బరుకుగా ఉంటుంది. అలా కాకుండా స్మూత్ గా ఉండాలంటే.. షేవింగ్ క్రీమ్ లో కొంచెం హెయిర్ కండిషనర్ కలిపి షేవ్ చేసుకుంటే సరిపోతుంది. షేవింగ్ తర్వాత మీ చర్మం స్మూత్ గా సూపర్ గా ఉంటుంది.

హెయిర్ స్టైల్..

ప్రస్తుత కాలంలో చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య బాధిస్తోంది. 30 దాటకముందే బట్టతల వచ్చేస్తోంది. అలాంటి వారు.. ముందు ఉన్న జుట్టును కాస్త చిన్నగా కత్తిరించి.. ఆ జుట్టుని పక్కగా దువ్వితే సరిపోతుంది. అలా చేస్తే.. బట్టతలని కాస్త కవర్ చేసుకోవచ్చు.

గాట్లకు లిప్ బామ్..

ఒక్కోసారి షేవింగ్ చేసుకుంటుంటే పొరపాటున గాట్లుపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ గాయం వద్ద లిప్ బామ్ రాయండి. రక్త స్రావాన్ని తగ్గించి త్వరగా మానిపోవడానికి సహాయపడుతుంది.

పళ్లు తెల్లగా..

చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ.. వాళ్ల పళ్లు మాత్రం  పసుపు పచ్చ రంగులో ఉంటాయి. అలాంటివాళ్లు ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్ది చుక్కల నిమ్మరసాన్ని కలిపి.. దానిని దంతాలకు రుద్దితే.. పచ్చదనం పోయి.. పళ్లు తెల్లగా మెరుస్తాయి.

జిడ్డు చర్మానికి చెక్..

కాఫీ లో ఉండే టానిన్ అదనపు కొవ్వు ఉత్పత్తులను నియంత్రించి, మీ చర్మాన్ని టోన్ చేస్తుంది. ఉపయోగించిన కాఫీ బ్యాగ్ తీసుకుని అదనంగా ఉన్నదాన్ని బైటకు తీసి, మీ బుగ్గలు, ముక్కు, గడ్డం మీద పెట్టుకోండి. ఇలా 5 నిముషాలు ఉంచి తరువాత శుభ్రంగా కడగండి. పురుషులు ప్రతిసారీ ఈ అలంకరణ చిట్కాను ప్రయత్నిస్తే మెరుపును కూడా పొందవచ్చు.