సిద్దిపేట జిల్లాలొ దారుణం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున సిద్దిపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే చనిపోయారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కడారి రాంబాబు(40), కడారి చందు (32) ఇద్దరు అన్నదమ్ములు. ఇవాళ ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో  వీరిద్దరు  అక్కడికక్కడే మృతి చెందారు. ఈ అన్నాతమ్ముల మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద దిక్కులను కోల్పోయిన మృతుల కుటుంభీకులు బోరున విలపిస్తున్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.  దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.