నరాలు తెగే ఉత్కంఠ.. కునుకు తీసిన సిద్ధరామయ్య

siddaramaiah sleeping in assembly
Highlights

అసెంబ్లీలో నిద్రపోయిన సిద్ధారామయ్య

దేశవ్యాప్తంగా అందరి చూపు కర్ణాటక వైపే చూస్తున్నాయి. కన్నడ పీఠం ఎవరికి దక్కుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అధికారం తమకే దక్కాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కూడా తంటాలు పడుతున్నాయి.

కర్ణాటకతో ఎలాంటి సంబంధం లేనివారు కూడా ఈ ఎన్నికల గురించి ఆరా తీస్తున్నారు. అయితే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధారామయ్య కు మాత్రం ఇవేమి పట్టినట్టు లేదు.
ఇందుకు విధానసభలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ఈరోజు కర్ణాటక అసెంబ్లీ సమావేశం కాగా, ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య సభలో కునుకు తీస్తూ కనిపించారు. ఈ దృశ్యం కాంగ్రెస్ నేతలను ఆందోళన కలిగించేలా చేస్తోంది. ఇంతటి ఉత్కంఠలో సిద్ధారామయ్యకు అసలు నిద్ర ఎలా పట్టింది అని పలువురు చర్చించుకోవడం గమనార్హం. మరోవైపు సీఎం యడ్యూరప్పతో ఎమ్మెల్యే శ్రీరాములు మంతనాలు జరుపుతూ కనిపించారు.
 
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోనుంది. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను సుప్రీం అనుమతించడంతో ఆయనే బలపరీక్షను నిర్వహించనున్నారు.  

loader