ఆయన ఓ ఎస్సై... భార్య కూడా కానిస్టేబుల్ గా పనిచేసి తర్వలో ఎస్సైగా ప్రమోట్  కాబోతోంది. కాకపోతే ఆమెకు పెళ్లికి ముందే మరో కానిస్టేబుల్ తో ప్రేమ వ్యవహారం ఉంది. భర్త పోలీసు అయినా తన ప్రియుడైన కానిస్టేబుల్ ను మాత్రం ఆమె వదలడం లేదు. చివరకు ఈ విషయం భర్తకు తెలియడం తో సీన్ అంతా రచ్చ రచ్చ అయింది.

 

చిత్తూరు జిల్లాలో ఎస్సైగా పని చేస్తున్న శివకుమార్ అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నగీన భార్యాభర్తలు. అయితే నగీనకు  కర్నూలు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ అబ్దుల్ గఫర్ భాషాతో సంబంధం ఉంది.ఇటీవల నగీనగా ఎస్సైగా ప్రమోషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ‌కు కర్నూలు వచ్చింది. తన తో పాటు  ప్రియుడ్ని కూడా వెంట తెచ్చుకొని ఓ లాడ్జిలో దిగింది.

అయితే అదే లాడ్జ్ లో ఆమె భర్త శివకుమార్ కూడా దిగాడు. దీంతో ఇద్దరు అడ్డంగా బుక్క్ అయ్యారు.

శివకుమార్ భార్య తీరుపై కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగీన కూడా తన భర్తపై అదే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును ఎలా డీల్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.