బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారా?

Should You Invest In Gold This Festive  Season
Highlights

  • బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
  • అయితే.. బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేదు.
  • ఒక సంవత్సరం పెరిగితే.. మరో సంవత్సరం తగ్గిపోతోంది.
  • ఇలాంటి బంగారం మీద పెట్టుబడులు పెట్టవచ్చా..?

పండగల కాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో వాహనాలు, గృహోపకరణాలు లాంటివి కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బంగారానికి శుభకార్యాలకు విడదీయరాని బంధం ఉందని చెప్పవచ్చు. పండగలకు, శుభకార్యాలలో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు మరింత ఆసక్తి కనపరుస్తారు. బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే.. బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేదు. ఒక సంవత్సరం పెరిగితే.. మరో సంవత్సరం తగ్గిపోతోంది. ఇలాంటి బంగారం మీద పెట్టుబడులు పెట్టవచ్చా.. పెట్టుబడులు పెట్టడంలో లాభాలు ఉన్నాయా?నష్టాలు ఉన్నాయా? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..

గత ఐదేళ్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి...

గత ఐదేళ్లలో బంగారం ధరలు ఒకసారి పరిశీలిస్తే.. బంగారం ధర పడిపోయిందనే చెప్పవచ్చు. 2012లో తులం బంగారం రూ.31,523 ఉండగా.. 2017లో బంగారం ధర రూ.27వేలకు పడిపోయింది.

2012 సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.31,523

2013సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.27,500

2014 సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.24,200

2015 సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.24,000

2016 సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.28,300

2017 సెప్టెంబర్ లో పది గ్రాముల బంగారం ధర రూ.27,000

 

బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా..

మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే శక్తి బంగారానికి మాత్రమే ఉంది. మార్కెట్ లో రూపాయి విలువ పడిపోయినా.. ఆ ప్రభావం బంగారంపై పెద్దగా చూపించదు. అందుకే బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. గత ఐదేళ్లలో బంగారం ధరను ఒకసారి పరిశీలిస్తే... పసిడి ధరలో మార్పలు చూడవచ్చు. కాబట్టి.. ఇందులో పెట్టుబడులు పెట్టడం అంత మంచిదేమీ కాదని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. కానీ.. ఆర్థిక పరిస్థితి సరిగాలేని సమయంలో.. ఈ బంగారమే మీకు రక్షణగా నిలుస్తుంది.

ఇప్పుడు మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారనుకుందాం. అలా కొనుగోలు చేసేటప్పుడు..ఆ ఆభరణం తాయరు చేయడానికి అయ్యే ఖర్చును కూడా దుకాణదారుడు మన మీదే వేస్తాడు. కానీ.. అదే ఆభరణాన్ని మనం అమ్మాలనుకుంటే మాత్రం.. మేకింగ్ ఛార్జీల ఖర్చు మనకు రాదు. అలా అని మేకింగ్ ఛార్జ్ వివరాలను తీసుకోకుండా ఉండొద్దు. ఎందుకంటే.. దానిని మనం అమ్మవలసి వచ్చినప్పుడు.. మనం వారిని పూర్తిగా నమ్మించినప్పుడే.. ఆ వస్తువుకి ఎక్కువ ధర పలుకుతుంది. కాబట్టి ఆ వివరాలు చాలా అవసరమౌతాయి.

మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకోవడానికి బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. బంగారం కొనడమే మంచి నిర్ణయం.

 

బంగారంలో పెట్టుబడులకు మార్గాలు..

పండగల వేళల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు.. బంగారు ఆభరణాలను లేదా గోల్డ్ కాయిన్స్ ని కొనుగోలు చేస్తారు. అయితే.. ఈటీఎఫ్ ( ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) లో పెట్టుబడులు పెట్టడం చక్కటి మార్గం. బంగారం పై పెట్టుబడులు పెట్టాలనుకుంటే బంగారమే కొనాల్సిన అవసరం లేదు. ఈ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెడితే సరిపోతుంది. డీమ్యాట్ ఎకౌంట్ ద్వారా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. తిరిగి తీసుకోవాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బంగారం ధర ను పట్టి మీరు పెట్టిన పెట్టుబడులు పొందవచ్చు.

 

ఇందులో పెట్టుబడులు పెట్టడం వలన దొంగల భయం ఉండదు. ఈ విధానంలో బంగారాన్ని డిజిటల్ ఫామ్ లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో ఎప్పుడైనా బంగారాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం లాంటివి చేసుకోవచ్చు. ఈ కొత్తరకం బంగారం పెట్టుబడుల విధానంతో.. పండగను మరింత సంతోషంగా జరుపుకోండి.

 

అధిల్ శెట్టి, బ్యాంకు బజార్.కామ్ సీఈవో

loader