ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై చెప్పులతో దాడి చేశారు. మరికొద్ది రోజుల్లో బేజీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం బార్ ఘర్ ప్రాంతంలో పర్యటించారు.  అనంతరం కుంభారీ గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై చెప్పులు విసిరాడు. చెప్పుల దాడి నుంచి సీఎం తప్పించుకున్నారు. అప్రమత్తమైన ఇతర నేతలు, కార్యకర్తలు.. చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చితకబాదారు. ఈ దాడి చేసిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.