విజయనగరం దివ్యాంగురాలి అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్

విజయనగరం దివ్యాంగురాలి అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్

విజయనగరం జిల్లాలో సంచలనంగా మారిన గ్యాంగ్ రేప్ లో షాకింగ్ నిజాలు బైటపడ్డాయి. విజయ నగరం లోని తన అక్క ఇంటికి ఒంటరిగా వెళుతుండగా తనపై ఓ ఆటో డ్రైవర్ తో పాటు అతడి స్నేహితులు అత్యాచారం చేశారని ఓ దివ్యాంగురాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు షాకింగ్ విషయాలు బైటపెట్టారు. 

పూసపాటిరేగకు చెందిన ఓ వికలాంగ యువతి విజయనగరంలోని తన అక్క ఇంటికి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి బైటికి వెళ్లింది. అయితే ఆమె అక్కడికి వెళ్లకుండా విజయనగరంలో తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు ఇప్పటివరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లావని నిలదీశారు. దీంతో భయపడిపోయిన యువతి  తనను ఓ ఆటో డ్రైవర్ అతడి స్నేహితులు అత్యాచారం చేశారంటూ చెప్పింది. దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా ప్రచారమై తీవ్ర కలకలం రేగింది.


అయితే యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన జరిగినట్లు యువతి చెప్పిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు స్థానికులను కూడా ప్రశ్నించారు. అలాగే యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, మెడికల్ రిపోర్టులకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. తన తల్లిదండ్రులకు భయపడే  ఆలా అబద్ధం చెప్పినట్లు యువతిఒప్పుకుంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos