ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు బాదిన  షోయబ్

shoaib malik slams six sixers in one over
Highlights

  • ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు అనగానే అందరికీ.. టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తుకువస్తారు
  • తాజాగా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టాడు. 

ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు అనగానే అందరికీ.. టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తుకువస్తారు.  2007 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్.. ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు. యువీ చేసిన ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. కాగా.. తాజాగా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టాడు.  కానీ.. యువీ రికార్డును మాత్రం  షోయబ్ సమం చేయలేకపోయాడు. ఎందుకంటే.. యూవీ రికార్డు క్రియేట్ చేసింది అంతర్జాతీయ  క్రికెట్ లో. కాగా.. షోయబ్ ఆడింది ఓ చారిటీ మ్యాచ్ లో కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ఫైసలాబాద్‌లో షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో షాహిద్‌ అఫ్రిది రెడ్‌- షాహిద్‌ అఫ్రిది గ్రీన్‌ జట్ల మధ్య పది ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో రెడ్‌కు ప్రాతినిధ్యం వహించిన షోయబ్‌ మాలిక్‌ 7వ ఓవర్లో ఆరు బంతులను సిక్స్‌ లుగా మలిచాడు. ఆ తర్వాత గ్రీన్‌ జట్టు తరఫున ఆడిన బాబర్‌ అజామ్‌ 26 బంతుల్లోనే 100(11×6, 7×4)పరుగులు నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ జట్టే విజయం సాధించింది.

loader