190 పరుగులకు పెవిలియన్ చేరాడు 

శ్రీలంక‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభ‌మైంది. బ్యాటింగ్ కి దిగిన ఇండియా భారీ స్కోర్ పై దృష్టి సారించింది. ఓపెన‌ర్ అభిన‌వ్ ముకుంద్ 26 బంతులు ఆడి 12 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. కానీ మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ మాత్రం నిల‌క‌డ‌గా ఆడాడు. 168 బంతుల్లో 190 ప‌రుగులు చేశాడు. అందులో 31 ఫోర్లు ఉన్నాయి. ఫ‌స్ట్ డౌన్ లో వ‌చ్చిన పూజారా కూడా నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు. 133 బంతుల్లో 74 ప‌రుగులు చేశాడు. ఇండియా 54.3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఒక వికేట్ కోల్పోయి 281 ప‌రుగులు చేసింది. రన్ రేటు 6.06 తో దూకుడు మీద ఉంది ఇండియా. కోహ్లీ బ్యాటింగ్ కి దిగాడు.