అంగారకుడిపై అడుగుపెట్టనున్న తొలి మహిళగా ఈ 15 ఏళ్ల యువతి చరిత్ర సృష్టించబోతోంది.

15 ఏళ్ల ఈ యువతి ఒక్క అడుగు వేస్తే... నాసా యాత్ర విజయవంతమవుతుంది... రోదసీ పరిశోధనలో మహిళ ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది.

అమెరికా 2030 లో చేపట్టనున్న అంగారక యాత్రకు ఈ యువతి కూడా ఎంపికైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్స్ ను చేరిన తొలి యువతిగా ఆమె ప్రపంచ చరిత్రను తిరగరాస్తుంది.

ఇంతకీ ఆమె ఎవరు తెలుసా.. లూసియానాకు చెందిన అల్యసా కార్సన్. పైలట్ శిక్షణ పూర్తి చేసుకోబోతున్న ఈ యువతి నాసా అంగారక యాత్రకు కూడా ఎంపికైంది.

దీనిపై కార్సన్ స్పందిస్తూ.. ‘ అస్ట్రోనాట్ కావాలనుకున్న నా జీవితాశయం నెరవేరబోతోంది ఈ సందర్భంగా అందరికి నేనో విషయం చెప్పాలనుకుంటున్నా... మీ కలలను నిజం చేసుకునేందుకు ఎప్పుడు వెనకడుగు వేయకండి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది’ అని యువతకు పిలుపునిచ్చింది.

కాగా, అస్ట్రోనాట్ శిక్షణలో భాగంగా కార్సన్... చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలను కూడా నేర్చుకుంటోంది. తన యాత్రలో పాలుపంచుకొనే సహచరులతో అనుసంధానం కావాడానికి ఇన్ని భాషలు నేర్చుకోవాలని చెబుతోంది.

కార్సన్... మార్స్ యాత్రపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మహిళలకు కార్సన్ యాత్ర స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఏలాంటి సందేహం లేదని పేర్కొన్నారు.

అయితే కార్సన్ ఈ యాత్రకు ఎంపికవడానికి అమెరికా చట్ట సభలు చేసిన కృషే కారణంగా చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యమైన కూడా శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో దీనిపై ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని అమెరికా భావించింది.

ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలిజీలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఇన్స్పైర్ వుమెన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇక పై సైన్స్, టెక్నాలజీలకు సంబంధించిన రంగాల్లో మహిళలకు కచ్చితంగా అవకాశాలు కల్పించాలి. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ఇన్స్పైర్ వుమెన్ యాక్ట్ మీద సంతకం చేశారు.