చార్జిషీట్ లో శశిథరూర్ పేరు: సునంద పుష్కర్ ది ఆత్మహత్యే కానీ...

Shashi Tharoor named in Sunanda Pushkar suicide chargesheet
Highlights

కాంగ్రెసు నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు కోర్టులో సోమవారం చార్జిషీట్ దాఖలు చేశారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెసు నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు కోర్టులో సోమవారం చార్జిషీట్ దాఖలు చేశారు. చార్జిషీట్ లో శశిథరూర్ పేరును చేర్చారు. సునంద పుష్కర్ ది ఆత్మహత్యేనని, అయితే శశిథరూర్ అందుకు ఆమెను ప్రేరేపించి ఉంటాడని ఆ చార్జిషీట్ లో పేర్కొన్నారు.

సునంద పుష్కర్ మృతి చెంది నాలుగేళ్లకు పైగా అవుతోంది. ఢిల్లీలోని హోటల్ గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది. చార్జిషీట్ ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ కు సమర్పించారు. 

శశిథరూర్ ను అనుమానితుడిగా చార్జిషీట్ లో చేర్చారు. వివాహ సంబంధమైన కారణాలే ఆత్మహత్యకు దారి తీసినట్లు చార్జిషీట్ లో తెలిపారు, శశిథరూర్ పేరును చార్జిషీట్ రెండో కాలమ్ లో చేర్చారు. నిందితుడిగా చేర్చడానికి శశిథరూర్ పై తగిన సాక్ష్యాధారాలు లేవని చార్జిషీట్ లో చెప్పారు 

పుష్కర్ 2014 జనవరి 17వ తేీదన ఢిల్లీలోని లగ్జరీ హోటల్ గదిలో మరణించారు. ఆమె మృతికి ముందు పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో ట్విట్టర్ లో వాదనకు దిగారు.  

loader