ఆత్మహత్యకు యత్నించిన క్రికెటర్ షమీ

ఆత్మహత్యకు యత్నించిన క్రికెటర్ షమీ

టీం ఇండియా క్రికెటర్  మహ్మద్ షమీ.. ఆత్మహత్యకు యత్నించారట. ఈ విషయాన్ని ఆయన భార్య  హసీన్ జహాన్ తెలిపారు. షమీకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనని హింసిస్తున్నాడని హసీన్ ఇటీవల  పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా షమీ కొంత మంది అమ్మాయిలతో దిగిన ఫోటోలు, ఛాటింగ్ వివరాలను స్క్రీన్ షాట్ తీసి మరి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. కాగా ఆమె ఆరోపణలను నమ్మిన బీసీసీఐ షమీ కాంట్రాక్టును కూడా రద్దు చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా షమీ గురించి మరిన్ని విషయాలను హసీన్ మీడియాకు వివరించారు. ‘మేమిద్దరం 2012లో తొలిసారి కలుసుకున్నాం. అంతకుముందు షమి తన సమీప బంధువుల్లో ఒక అమ్మాయిని ఐదు సంవత్సరాల పాటు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆ అమ్మాయి కుటుంబసభ్యులు షమీతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన షమీ ఆత్మహత్యకు యత్నించాడు’ అని తెలిపింది హసీన్‌.

‘షమీ కోసం నేను అన్ని చేశా. నా మోడలింగ్‌ కెరీర్, ఉద్యోగం వదులుకున్నా. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆస్తులు, బీమాకు సంబంధించిన పత్రాలను తీసుకున్నాడు. గత రెండేళ్ల నుంచి విడాకులు ఇవ్వాలని కోరుతూనే ఉన్నాడు. కానీ, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విడాకులు ఇవ్వను. షమీపై నేను చేస్తున్న ఆరోపణలన్నింటికీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే అతన్ని కోర్టుకు లాగుతా’ అని హసీన్‌ వివరించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos