బెంగళూరు మహిళను ఆటో డ్రైవర్ ఏం చేసిండంటే

బెంగళూరు మహిళను ఆటో డ్రైవర్ ఏం చేసిండంటే

మహిళా వేధింపుల పట్ల పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన వారిపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళలు ఏదో ఒకచోట, ఎవరో ఒకరి చేతిలో లైంగికంగా వేధింపబడుతున్నారు. అలాంటి సంఘటనే బెంగళూరు పట్టణంలో చోటుచేసుకుంది.  ఒంటిరిగా ఓలా ఆటో ఎక్కిన 19 ఏళ్ల యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కటకటాలపాలైనాడు. 

వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లో నివాసముండే ఓ యువతి బయటకు వెళ్లడానికి ఓలా ఆటో ను బుక్ చేసుకుంది. ఈ ఆటోలో ప్రయాణిస్తూ కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ మంజునాథ్ ఆమెతో అనభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.  అమ్మాయిని అద్దంలో చూస్తూ వెకిలిచేష్టలు ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా యువతి మీద చేతులు వేస్తూ తడమడం, అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. తనకింకా పెళ్లి కాలేదని నువ్వు వస్తే ఇద్దరం ఎంజాయ్ చేద్దామని, తన లైంగిక వాంఛ తీర్చాలని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతటితో ఆగకుండా ఆటోను నిర్జన ప్రదేశాల వైపు తరలిస్తుండగా ఆ యువతి భయంతో ఆటోలోంచి బయటకు దూకింది.  వెంటనే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది.

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆటో నెంబర్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోను షెడ్ వద్ద పార్క్ చేసి ఇంట్లో దాక్కున్న మంజునాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతడిపై వేదింపుల కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos