ప్రస్తుత కాలంలో శృంగారం పట్ల ప్రజల తీరు మారుతోంది. ఒకప్పుడు ఇద్దరి వ్యక్తుల మధ్య, నాలుగు గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ.. టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. మనుషుల ప్రవర్తనలోనూ మార్పులు వచ్చాయి. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన దానిని పబ్లిక్  చేసేస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్లు.. విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో కూడా సెక్స్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.

అమెరికాకు చెందిన ఓ సంస్థ చేపట్టిన తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అమెరికన్లు ఎయిర్ పోర్ట్ లలో ఎక్కువగా శృంగారం చేస్తున్నట్లు ఆ సర్వేలో తేలింది. 80శాతం మంది వారి లైఫ్ పార్టనర్ లతోనే ఇలా చేస్తుంటే.. మిగిలిన 20శాతం మంది అపరిచితులు, ఎయిర్ పోర్టు సిబ్బందితో సెక్స్ చేస్తున్నారట.

విమానాశ్రయానికి వచ్చే ప్రతి పది మందిలో 8మంది ఇలానే చేస్తున్నట్లు సర్వేలో తేలింది. విమానం ఆలస్యం గా రావడం లేదా ప్రయాణికులే ముందుగా విమానాశ్రాయానికి చేరుకోవడం లాంటివి జరిగినప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా టాయ్ లెట్లు, వీఐపీయ క్యాబిన్ లలోనే రాసలీలలు సగిస్తున్నారు.