ఆ సమయంలో.. కలయిక ఒకేనా...? అవన్నీ అపోహలేనా?

First Published 3, Apr 2018, 2:32 PM IST
sex during pregnency is safe or not?
Highlights
నెలలు నిండిన తర్వాత కూడా సెక్స్.. ఆరోగ్యకరమేనా?

భార్య తల్లికాబోతోంది అన్న విషయం తెలయగానే.. మొదట సంతోషించేంది భర్తే. తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసిన నాటి నుంచి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తారు. వీరు తీసుకునే జాగ్రత్తలో మొదటిది కలయికకు దూరంగా ఉండటం. ప్రెగ్నెన్నీ సమయంలో శారీరకంగా కలిస్తే.. కడుపులో బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే.. అవన్నీ అపోహలే అంటున్నారు నిపుణులు.

ప్రెగ్నెన్సీ సమయంలో కూడా భార్యభర్తలు శృంగార జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అంటున్నారు నిపుణులు. దీనివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాదు కూడా. ఎందుకంటే పాపాయి గర్భసంచిలో ఉమ్మనీటి మధ్య ఉంటుంది. పైగా మ్యూకస్‌ గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది. గర్భాశయ కండరాలు కూడా దృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ఏ ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు ఎదురైనా అవి పుట్టబోయే పాపాయి వరకూ చేరవు. కాబట్టి భయపడక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యులు కొందరు మహిళలకు హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ అని నిర్ధరిస్తారు. అలాంటప్పుడూ, మరికొన్ని సందర్భాల్లో లైంగికచర్యకు దూరంగా ఉంటేనే మంచిది.

అదెప్పుడంటే.. నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు. గతంలో అబార్షన్లు అయినప్పుడు, ఉమ్మనీరు తక్కువగా ఉందని తెలిసినప్పుడు, అకారణంగా రక్త స్రావం లాంటివి అయినప్పుడు మాత్రం సెక్స్ కి దూరంగా ఉండాలి. ఈ సమస్య  లేకపోతే.. సెక్స్ ని వాయిదా వేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

loader