ఈ ఐటీ కంపెనీలో బలవంతంగా గెంటేస్తున్నారు

First Published 14, Dec 2017, 4:38 PM IST
Several Verizon employees laid off
Highlights
  • హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వాకం
  • బలవంతంగా ఉద్యోగుల చేత రాజీనామాలు

ప్రముఖ ఐటీ కంపెనీ వెరిజాన్..ఉద్యోగుల చేత బలవంతపు రాజీనామాలు చేయిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 500మందికిపైగా ఉద్యోగుల చేత రాజీనామాలు చేయించారు. చెన్నైలో 200మంది ఉద్యోగులను తొలగించగా.. హైదరాబాద్ లో 300మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఒక్కసారిగా కంపెనీలోని ఇతర ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.

విజయ్(పేరుమార్చాం) అనే ఒక ఉద్యోగి వెరిజాన్ లో ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మంగళవారం యథావిథిగా ఆఫీసుకి వెళ్లగా.. అతనిని ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందిగా హెచ్ ఆర్ కోరారు. రాజీనామా చేసినందుకుగాను.. 4నెలల జీతం అదనంగా ఇస్తామని ఆఫర్ కూడా చేశారు. అందుకు అంగీకరించకపోతే.. పక్కనే ఉన్న బౌన్సర్ తో బెదిరించి మరీ బలవంతంగా రాజీనామా చేయించారు.

దాదాపు అందరి రాజీనామాలు ఇదేవిధంగా సాగాయి. కాగా.. దీనిపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉద్యోగులు ఐటీ ప్రొఫెషనల్స్ ఫోరమ్ కి తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  కాగా.. కంపెనీ నిర్వాహకుల వాదన మాత్రం మరోలా ఉంది. ఉద్యోగం నుంచి తొలగించిన వారంతా.. టెక్నికల్ గా రాణించలేకపోతున్నారని... అందుకే తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే విషయాన్ని మాత్రం కంపెనీ స్సోక్స్ పర్సన్ చెప్పడానికి అంగీకరించలేదు. 

loader