మ‌హిళ‌ల‌పై బిజెపి నాయ‌కుడు సంచల‌న వ్యాఖ్య‌లు

sensational comments bjp leader on ladies
Highlights

  • మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజేపి లీడర్
  • మహిళలు రాత్రిపూట బయట ఎందుకు తిరుగుతారని కామెంట్

రాత్రి వేళల్లో మహిళల‌ను బయటకు ఎందుకు పంపింస్తార‌ని ప్ర‌శ్నించారు హార్యానా బిజేపి ఉపాధ్య‌క్షుడు ర‌ఘుప‌తి భ‌ట్టీయా. మ‌హిళ‌ల‌ను బ‌య‌ట తిరిగ‌డాన్ని నిషేధించాల‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల చేసిన ర‌ఘుప‌తి భ‌ట్టీ పై దేశ వ్యాప్తంగా  విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  

కొద్ది రోజుల క్రితం హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో ఐఏఎస్ అధికారి కుమార్తెను వేధించారు. ఇప్ప‌టికే ఈ విష‌యం దేశ వ్యాప్తంగా సుభాస్ బ‌రాలా  విమ‌ర్శ‌లు ఎదుర్కోనాల్సి వ‌స్తుంది. మ‌రో వైపు విపక్ష పార్టీలు బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ కేసు కోర్టులో న‌డుస్తుంది.

ఇప్పుడు ఆ సంఘ‌ట‌న‌ను ఉద్దేశించి హార్యానా బిజేపి ఉపాధ్య‌క్షుడు ర‌ఘుప‌తి మాట్లాడుతూ రాత్రి వేళల్లో మహిళను బయటకు ఎందుకు పంపిస్తార‌ని అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అమ్మాయిల పట్ల జాగ్రత్త వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక మీద‌ట అమ్మాయిల‌ను రాత్రి వేళలో బయటకు తిరిగేందుకు అనుమతించకూడదని ఆయన సలహా ఇచ్చారు. 


ర‌ఘుప‌తి భ‌ట్టీ చేసిన వ్యాఖ్య‌ల‌కు విప‌క్షాల నుండే కాకుండా మ‌హిళ‌ల నుండి కూడా తీవ్ర‌ వ్య‌తిరేక‌త వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.


మ‌హిళ‌ల‌పై బిజెపి నాయ‌కుడు సంచల‌న వ్యాఖ్య‌లు

loader