ఈ ఎలుకలు ఎoత పని చేశాయో చూడండి ( వీడియో )

First Published 16, Apr 2018, 5:15 PM IST
See what these rats doing
Highlights

ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది

 ఎలుకల దెబ్బకు మంకమేశ్వర్ ఆలయ సమీపంలోని మూడంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయిది. భవనం కూలడానికి కొన్ని గంటల ముందే భవనాన్ని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భవనం కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 భవనం కూలిన ప్రాంతంలో ఎలుకల సమస్య ఏళ్లుగా ఉంది. ఇటీవల అది మరింత పెరిగింది. ఇళ్ల లోపల కలుగులు చేసుకుని అందులో నివసిస్తూ ఆ ప్రాంతంలో ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. మురుగు కాల్వల పైపుల్లోకి జొరబడి వాటిని పాడుచేయడం, ఇంటి పునాదుల్లోకి కలుగులు చేసుకుని అందులో నివసిస్తూ ఆ ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో  ఓ మూడంతస్తుల భవనం కింద నివాసం ఏర్పరచుకున్న వేలాది ఎలుకలు పెద్ద ఎత్తున రంధ్రాలు చేశాయి. ఫలితంగా పునాది బలహీనమైంది. దీనికి తోడు శనివారం కురిసిన భారీ వర్షాలకు నీరు భవనంలోని కలుగుల్లోకి చేరి భవనం ప్రమాదకరంగా మారింది. పెను ప్రమాదం జరగబోతోందని ముందే గుర్తించిన భవనం యజమాని వెంటనే అప్రమత్తమై అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాడు. ఆ తర్వాత కొన్ని గంటలకే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దృశ్యాన్ని అక్కడి సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేశాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

 

loader