నల్లగొండలో మరో దారుణం జరిగింది.  నల్లగొండ పట్టణంలో వన్టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలను నరికే శారు. అక్కడి  ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండా ప్రహరీ గోడ దిమ్మెపై ఈ వ్యక్తి  తలను పెట్టారు. దీనితో పట్టణమంతా వుళిక్కిపడింది. మొదట మొండెం  కనిపించలేద.  మొండెం కోసం పోలీసులు గాలించారు. తర్వాత మొండెం కూడా  కనిపించింది.  ... మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య జరిగి వారం గడవక ముందే మరో హత్య జరగడం జిల్లాలో  కలకలం రేపుతోంది. మృతుడు కనగల్ కు చెందిన పాలకూరి రమేశ్ గా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

రమేశ్ కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నాడు. మందుల కోసం ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఆచూకి లేదు. కారణం తెలియరావడం లేదు.అయితే,  గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపారు. తలను నరికి శరీరంగా నుంచి వేరు చేశారు. ఆ తలను తీసుకెళ్లి జెండా దిమ్మెపై పెట్టారు. మొండెం ఒక  గ్యాస్ గోడౌన్ సమీపంలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. జనవరి 28వ తేదీ ఆదివారం రాత్రి ఈ హత్య జరిగింది.