భార్య అందాల పోటీ కోసం దొంగ‌గా మారిన బ‌డి పంతులు

school teacher rob because his wife beauty contest
Highlights

  • భార్య కోసం దొంగతనం ప్లాన్.
  • పక్కాగా అమలు చేసిన భర్త.
  • కానీ చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు.

ప్ర‌తి భ‌ర్త విజ‌యం వెనుక ఒక భార్య ఉంటుంద‌నేది నిన్న‌టి మాట, కానీ నేడు ప‌రిస్థితి మారింది. ఒక భ‌ర్త త‌న భార్య ల‌క్ష్య సాధ‌న కోసం ఏకంగా దొంగ‌గా మారాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో సర్కాంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ గుప్తా ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు. త‌న భార్య అందాల పోటీలో పాల్గోనాల‌కుంది. అయితే అందుకు చాలా ఖ‌రీదైన చీర‌లు కావాలి. శ్రీకాంత్ కు వ‌చ్చే జీతం అస్స‌లు స‌రిపోదు. కానీ ఎల‌గైనా త‌న భార్య కోరిక‌ను నెర‌వేర్చాల‌నుకున్నాడు.


 డ‌బ్బు కోసం ఏం చేయాల‌ని ఆలోచించాడు శ్రీకాంత్. అప్పుడు త‌న‌కి త‌ట్టిన ఆలోచ‌న దొంగ‌త‌నం. ప్లాన్ చేశాడు శ్రీకాంత్ ఇంటికి ద‌గ్గ‌ర‌గా ఉన్న షాపింగ్ మాల్ నుండి రెండు ఖరీదైన డిజైనర్ చీరలను దొంగిలించాడు. అవి త‌న‌ భార్య ప్రమీలకు ఇచ్చాడు. ప్రమీల చోరీ చేసి తెచ్చిన చీరలు ధరించి అందాల పోటీల్లో క్యాట్ వాక్ చేసింది. 
 ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ అక్క‌డే దొరికిపోయాడు శ్రీకాంత్. 

 అందాల పోటీల్లో ప్రమీల ధరించిన చీరను గుర్తించాడు మాల్ లో ప‌ని చేస్తున్న ఓ వ్య‌క్తి, త‌మ షాపులో పోయిన చీరలు అందాల పోటీలో ప్ర‌మీల ధ‌రించిన చీర‌లు ఒకటేనని గుర్తించి, ఆ విషయాన్ని మాల్ యజమానికి తెలిపాడు. మాల్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. శ్రీకాంత్ అడ్డంగా బుక్ అయ్యాడు. త‌ను చేసిన బాగోతం బట్టబయలైంది. చివ‌రికి శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేసి 6 నెల‌లు జైలుకు పంపించారు.
 

loader