తెలంగాణాలో మాదిగల ధర్మ యుద్ధం తర్వాత కర్నాటక లో ఎస్ సి రిజర్వేషన్లను వర్గీకరంచాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. జస్టిస్ సదాశివ కమిషన్ సిఫార్సులను అమలుచేయడానికి తాము వ్యతిరేకమని చెబుతున్నారు.

కర్నాటకలో షెడ్యుల్డ్ కులాల వర్గీకరణ చిచ్చు రగిలే అవకాశాలు కనపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులే దీనికి వ్యతిరేకంగా ఉన్నారు.

ఎందుకంటే, కర్నాటకలో కూడా ఎస్ సి రిజర్వేషన్లను నాలుగు వర్గాలుగా విభజించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ అంశాన్ని అధ్యయనం చేసేందుకు గతంలో ప్రభుత్వం జస్టిస్ ఎజె సదాశివ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ 2012లో తన నివేదికను అప్పటి ముఖ్యమంత్రి సదానంద గౌడకు సమర్పించింది. ఎస్ సి లను నాలుగు వర్గాలుగా విభజించి రిజర్వేషన్లనుజనాభా దమాషాలో అందివ్వాలని సదాశివ కమిషన్ సిఫార్సు చేసింది. అంతేకాదు, నివేదికను అమలు చేసే విషయం పై కేంద్రంతో సంప్రదించాలని కూడా సదాశివ కమిషన్ సూచించింది.

 అప్పటినుంచి ఈ నివేదికను అమలు చేసే విషయం అన్ని ప్రభుత్వాల దగ్గిర నానుతూ వస్తున్నది. ఇపుడు తెలంగాణాలో మాదిగ ల ధర్మయుద్ధం తర్వాత కర్నాటకలో కూడా క్యాటగరైజేషన్ కోసం వత్తిడి పెరుగుతూ ఉందని తెలిసింది. కేంద్ర మంత్రి, మూడు సార్లు కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయిన వెంకయ్య నాయుడు స్వయానా ఎస్ సి రిజర్వేషన్ కు మధ్దతు ప్రకటించారు. మాలలు అధికంగా తెలంగాణాలో ఈ డిమాండ్ కు అన్ని రాజకీయ పార్టీల మధ్దతు ఉంది. ఈ మధ్య జరిగిన ఎంఆర్ ఫిఎస్ నాయకత్వంలో జరిగిన ధర్మయుద్ధం తర్వాత కర్నాటక ప్రభుత్వంలో కూడా ఈ క్యాటరైజేషన్ గురించి యోచన మొదలయింది.వెంటనే దీనిని కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది.

ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ శాసన సభ్యులు జి పరమేశ్వర, హెచ్ సి మహదేవప్ప, రుద్రప్పలమాని లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు నిన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలసి సదాశివ కమిషన్ నివేదికను అమలుచేయవద్దని కోరారు. ఎస్ సి రిజర్వేషన్లను విభజించడమంటే తేనెతుట్టను కదపడమే నని వారు ముఖ్యమంత్రి హెచ్చరించారు.

తెలుగురాష్ట్రాలలో ఎస్ సిలను వారి వెనకబాటు తనాన్న బట్టి ఎబిసిడిలుగా విభజించాలనే డిమాండ్ వుంటే, కర్నాటకలో ఎస్ సిలను కుడిచేయి, ఎడమచేయి, షెడ్యూల్డ్ కులాలు, అశ్ ప్రుశ్యులు కాని వారు అనే నాలుగు వర్గాలుగా విభజించి వారికి ఆరు, అయిదు, ఒకటి, మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సదాశివ కమిషన్ సిఫార్సు చేసింది.