నిరుద్యోగులకు శుభవార్త. ఎస్బీఐ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) లోని జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగిన భారతీయులు ఎవరైనా ఈ పోస్టు కోసం అప్లై చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. మొత్తం8301 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగం కోసం అప్లై చేయదలుచుకునే వారు ఎస్బీఐ బ్యాంక్ వెబ్ సైట్ ఓపెన్ చేసి దానిలో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి10. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆన్ లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష ఈ ఏడాది మార్చి లేదా ఏప్రెల్ నెలలో ఉండే అవకాశం ఉంది. విద్యార్హత, వయసు తదితర పూర్తి సమాచారం కోసం https://www.sbi.co.in/careers  లేదా https://bank.sbi/careers కి లాంగి అవ్వండి.