జయలలిత అంత్యక్రియలపుడు కనిపించిన అసాధారణ దృశ్యం అమె స్నేహితురాలు శశికళకు లభించిన ఎనలేని గుర్తింపు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఇతర నాయకులు ఎక్కవ సేపు ఓదార్చింది అమెనే.... దీని భావమేమిటి?
ఎందుకంటే,
జయలలిత అంత్యక్రియల దగ్గిర నేస్తం శశికళ మీద అందరి కళ్లున్నాయి. నిన్నంతా అమెకే ప్రాధాన్యం.
అమెయే జయలలిత అంత్యక్రియలు నిర్వర్తించింది. అమె కుటుంబ పెద్దలాగా వ్యవహరించింది. మధ్యలో హఠాత్తుగా జయలలిత సోదరుడు జయకుమార్ కొడుకు దీపక్ కనిపించినా, అతను కూడా అమె వెంటే ఉన్నాడు. రాజాజీ హాల్లో జయ పార్థివ దేహం పక్కన నిలబడుకున్నది అమెయే. ముఖ్యమంత్రి పన్నీర్ ఎక్కడో మంత్రుల మధ్య కూర్చకుని ఉన్నాడు. లేదా రోధిస్తూ ఉన్నాడు.
జయలలిత శవవాహనం మీద నిలబడి, ఎంజిఆర్ సమాధి దాకా తోడుగా వచ్చింది. శశికళయే.
మరెవ్వరు అమెపక్క నిలబడలేదు. జయలలిత అశేష అభిమాన ప్రపంచానికి, ఎఐడిఎంకె కార్యకర్తలకు, శాసన సభ్యులకు, మంత్రులకు శశికళయే ‘చిన్నమ్మ’ అని చెప్పేందుకు ఇంతకంటే పెద్ద ప్రకటన అవసరమా? వైష్ణవ సంప్రదాయం ప్రకారం జయలలి అంతిమ సంస్కారాలు శశికళ యే పూర్తి చేశారు. 1987లో ఎంజిఆర్ శవవాహనం మీదినుంచి జయలలితను దించేసినట్లు శశికళను ఎవరూ దించలేదు. కనీసం ముఖం చిట్లించినట్లు కూడా లేరు.
అంతేకాదు, చాలా మంది జాతీయ నేతలు కూడా జయ తర్వాత అమెయే అనే సందేశమిచ్చారు.ఎలా ఇచ్చారో చూడండి.
ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ సేపు ఓదార్చింది కూడా శశికళనే. ఆయన ఆమె తలనిమిరుతూ ఓదార్చడం అందరికి ఆశ్చర్యమేసింది. రాజాజీ హాల్లోకి రాగానే ఎఐడిఎంకె సభ్యులంతా ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పుష్పగుచ్చం జయలలిత దగ్గిర ఉంచిన తర్వాత కలిసింది శశికళనే. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసు రాహుల్ని నేరుగా శశికళ దగ్గిరకు తీసుకెళ్లి ఆమెని, భర్త నటరాజన్ ని పరిచయం చేశారు.
అంత్య క్రియల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బంధువులు అంతా శశికళ కుటుంబసభ్యులే. శశికళ మేనల్లుడు డాక్టర్ శివకుమార్, జయ అసుపత్రిలో చేరినప్పటినుంచి వెన్నంటిఉన్నారు. నిన్నటి అంత్యక్రియల్లో కూడా పెద్ద పాత్ర అయనదే.
అందువల్ల శశికళ చిన్నమ్మ అయినట్లే నని అంతా అనుకుంటున్నారు. పన్నీర్ సెల్వమ్ కు, ఈ చిన్నమ్మకు అంత మంచి సంబంధాలు లేవు. అందువల్ల తనుండగా పన్నీర్ సెల్వం పదవి వెలగబట్టడం ఆమెకు నచ్చుతుందా. నచ్చకపోతే, ధాకరే చనిపోయాక శివసేనకు ఎదురయిన పరిస్థితే వస్తుందా? ఎఐడిఎంకె పార్టీ రెండు వర్గాలు విడిపోతుందా? అపుడు మోదీ, బిజెపి పాత్ర ఏమిటి? ఇప్పడి ప్రశాంత పరిస్థితి తుఫాను ముందటి ప్రశాంతియేనా... ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే.
.
