Asianet News TeluguAsianet News Telugu

9గజాల చీరతో.. మారథాన్లో పాల్గొంది..

  • 9గజాల చీరతో మారథాన్ లో పాల్గొన్న జయంతి
  • 42కిలోమీటర్ల దూరాన్ని.. ఐదు గంటల్లో ఆమె పూర్తి చేసింది.
Saree stopper Run Jayanti run

మారథాన్ అనగానే.. అందరూ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొనే పాల్లొంటారు. ఎందుకంటే పరిగెత్తడానికి కంఫర్ట్ గా ఉంటుందని. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా 9గజాల చీర కట్టుకొని మరీ మారథాన్ లో పాల్గొంది. ఆవిడే జయంతి సంపత్ కుమార్.

 

వివరాల్లోకి వెళితే.. జయంతి సంపత్ కుమార్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్. ఆమెకు చేనేత వస్త్రాలంటే అభిమానం ఎక్కువ. చేనేత వస్త్రాలు తయారు చేసే నేతన్నలకు తగిన గుర్తింపు రావడం లేదని ఆమె బాధపడేది. అందుకే వారి గొప్పతనాన్ని తెలిపేందుకు ఆమె చీర కట్టుకొని మరీ మారథాన్ లో పాల్గొంది. సాధారణంగా మహిళలకు 6గజాల చీరే చాలా ఎక్కువ. చాలా పెద్దగా ఉంటుంది.

 

అలాంటిది ఆమె ఏకంగా 9 గజాల చీర కట్టుకుంది. ఆ చీర కట్టుకొని.. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎయిర్ టెల్ వారు ఏర్పాటు చేసిన మారథాన్ లో పాల్గొంది. 42కిలోమీటర్ల దూరాన్ని.. ఐదు గంటల్లో ఆమె పూర్తి చేసింది.

 

కేవలం చేనేత వస్త్రాలపై తనకు ఉన్నమక్కువను తెలియజేయడానికి మాత్రమే కాదని.. అందరూ చీరలను ఇష్టంగా కట్టుకోవాలని.. చీర కూడా కంఫర్ట్ గా ఫీలవచ్చని చెప్పేందుకు తాను చీర కట్టుకొని పరుగులో పాల్లొన్నానని చెప్పారు. చాలా మంది తనతో సెల్ఫీలు దిగేందుకు ఇష్టపడుతున్నారని.. అది తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.

 

గతేడాది ఆగస్టులో నిర్వహించిన ఓ మారథాన్ లో ఆమె సగం దూరం పాల్గొంది. అదేవిధంగా చెన్నైలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మారథాన్ లో కూడా ఆమె పాల్లొన్నారు. చీర కట్టుకొని మారథాన్ లో పాల్గొనాలంటే.. కచ్చితంగా శిక్షణ అవసరం. జయంతి.. తన కుటుంబసభ్యులు రన్నింగ్, సైక్లింగ్ లాంటివి తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారట.

 

వాళ్ల అమ్మ, అమ్మమ్మ.. ఎప్పుడూ చీరలే కట్టుకునేవారని.. అంతేకాకుండా వాళ్లు ఎప్పుడూ చీర కట్టుకోవడం ఇబ్బందిగా ఫీలవ్వలేదని జయంతి తెలిపారు. అందుకే తాను కూడా చీరలను తన లైఫ్ స్టైల్ లో ఓ భాగం చేసుకోవాలని భావించానని ఆమె చెప్పారు. అంతేకాదు.. ఆమె మారథాన్ లో పాల్గొనేటప్పుడు స్పోర్ట్స్ షూ కాకుండా సాధారణ సాండిల్స్ వేసుకున్నారట. దీంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios