దేశంలోని మహిళలందరికీ శుభవార్త. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒక్క చీర కూడా కొనలేకపోయామే అని ఇక బాధపడకండి.  సంక్రాంతి పండగకకు షాపింగ్ చేయలేకపోతున్నాం అని ఫీలవకండి.

 

మీలాంటి వాళ్ల కోసం కర్నాటకలోని బీదర్ కు చెందిన ఈ బట్టల వ్యాపారి భలే ఐడియాతో ముందుకొచ్చారు.

 

What can you get for Rs. 1? A saree!
What can you get for Rs. 1? A saree!

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పడకుండా బంపర్ ఆఫర్ తీసుకొచ్చాడు. కేవలం ఒక్క రూపాయికి ఒక చీర ఇస్తానంటూ ప్రకటించాడు.

కాకపోతే ఇక్కడ చిన్న షరతు పెట్టాడు. ఆ ఒక్క రూపాయి నోటు మాత్రమే చెల్లటాటు అవుతుంది. ఒక్క రూపాయి కాయిన్ అయితే తీసుకోరు.

 

సో, ఇంట్లో ఒక్క రూపాయి నోటు ఉంటే ఇక ఏ మాత్రం ఆలోచించకండి. అక్కడ ఇప్పటికే కోకంత పెద్ద క్యూ ఉంది. తర్వగా వెళ్లండి.