2017  టాప్ లిస్ట్ లో హైదరాబాద్ సంగీత (2 వీడియోలు)

sangeetha issue is top list in 2017
Highlights

  • 2017 లో సంచలనంగా మారిక సంగీత వివాదం
  • ఇప్పటికీ దీక్ష కొనసాగిస్తున్న సంగీత

2017 ఈ సంగీత జీవితంలో విషాదాన్ని నింపిన ఏడాది. ఆడ పిల్లకు జన్మనిచ్చిందన్న ఒకే ఒక్క కారణంతో భర్త చేతిలో చిత్ర హింసలకు గురయ్యింది. అయినా ఈ హింసలను భరించింది. అయితే భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని ఏకంగా ఇంట్లోనే కాపురం పెట్టడంతో తట్టుకోలేక పోయింది. ఇదేమిటని భర్తను, అత్తామామలను ప్రశ్నించడమే ఆమె తప్పయింది. ఇలా ప్రశ్నించిన సంగీతను గొడ్డును బాదినట్లు బాది ఇంట్లోంచి తరిమేశారు. అయితే ఆమెను కొడుతున్న వీడియో సోషల్ మీడియా కెక్కడం, అది కాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభించడంతో పోలీసులు సంగీత భర్త, టీఆర్ఎస్ యూత్ లీడర్ పులగండ్ల శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

సంగీతను భర్త చితకబాదుతున్న వీడియో. ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంగీత బాధను బైటపెట్టింది

 

 

అయితే తనకు, తన కూతురికి న్యాయం కావాలంటూ సంగీత భోడుప్పల్ లోని అత్తవారింటి ముందు దీక్షకు దిగింది. ఆమె దీక్షకు మహిళా సంఘాలు, స్థానికులు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దోషిగా నిలబడటంతో తమ పార్టీ పరువు పోతుందని భావించి ఎంపీ మల్లారెడ్డి రంగంలోకి దిగారు. బాధితురాలిని పరామర్శించిన ఎంపి, ఎమ్మెల్యేలు ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంగీత అత్తామామలతో పాటు భర్తతో చర్చలు జరిపినప్పటికి  అవేవి పలితాలివ్వలేదు. అలాగే జేఏసి చైర్మన్ కోదండరాం కూడా సంగీతకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఇలా స్థానికులు, మహిళా సంఘాలు, అధికార పార్టీ ఎంపి, ఎమ్మెల్యే, ప్రజాసంఘాలు ఇలా ఎంత మంది అండగా నిలిచినప్పటికి సంగీతకు మాత్రం న్యాయం జరగలేదు.

దాడి తర్వాత సంగీత ఎలా విజృంబించిందో కింది వీడియోలో చూడండి


శ్రీనివాస్ రెడ్డి ని టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అతడు ప్రస్తుతం జైళ్లో ఉన్నాడు. అతడి తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా వారిలో ఏమాత్రం మార్పు లేదు. సంగీతను తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తామని, ఆమెకు అన్యాయం జరగనివ్వమని హామీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సంగీత నెల రోజులు గడిచినా ఇంకా భర్త ఇంటిముందు దీక్ష కొనసాగిస్తూనే ఉంది. ఇలా 2017 సంగీత జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2018 లోనైనా సంగీత జీవితంలో వెలుగులు నిండాలని ఆశిద్దాం.

loader