Asianet News TeluguAsianet News Telugu

పవన్ కాన్వాయిపై చెప్పుతో దాడి(వీడియో)

  • ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న పవన్
  • పవన్ కాన్వాయిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి
sandals attack on pawan convoy video viral

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్  కళ్యాణ్ కి ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది.  ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. పవన్ కళ్యాణ్ మీదకు విసిరినప్పటికీ ఆ చెప్పు.. వాహనంపై పడింది.అసలు విషయం ఏమిటంటే.. పవన్ రెండు రోజుల క్రితం కరీంనగర్ లో ప్రజా యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ యాత్రంలో భాగంగా ఆయన బుధవారం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. 

బుధవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా తల్లాడలో పవన్ టాప్ లెస్ వాహనంలో పర్యటిస్తున్నారు. ఆయన వాహనంలో ప్రయాణిస్తూ.. అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తి ఆయన కాన్వాయిపైకి చెప్పు విసిరాడు. అది పవన్ వాహనంపై పడింది. దీంతో వెంటనే తేరుకున్న అభిమానులు తొలగించేశారు. ఇంత జరిగినా.. పవన్ ఎలాంటి ఆగ్రహానికి లోనవ్వకుండా.. చిరునవ్వుతో తన యాత్రను కొనసాగించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

ఘటన అనంతరం ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పవన్ ప్రసంగిస్తూ.. ''నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం లేదు. మానవత్వం, జాతీయతను గౌరవిస్తా. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు. వ్యూహంలో భాగంగానే కొద్దిగా తగ్గుతాను. ఎన్నికల్లో సీట్లు ఇస్తేనే సామాజిక న్యాయం జరగదు. తమ కులం అభివృద్ధి చెందకపోవడంపై నేతలు ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదు. కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య నన్ను కదిలించింది. ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. ఇంతకాలం ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలను వెలుగులోకి తేవాలి. సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు..సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను'' అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios