ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ పేరిట ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఎస్8 మరింత మెరుగుపరిచి దానికి కొనసాగింపుగా ఈ ఫోన్లను విడుదల చేశారు. రూ.2వేలు చెల్లించి ఈ ఫోన్ ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, కోరల్‌ బ్లూ, టైటానియం గ్రే, లిలాక్‌  పర్పుల్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.  ఈ ఫోన్లలో ఓ ప్రత్యేకత ఉంది. వీటిలో ఏఐ, ఏఆర్ టెక్నాలజీ వినియోగించారు. ఈ టెక్నాలజీ.. ఫోన్ ముందు ఉన్న వస్తువును గుర్తిస్తుంది. ఫోన్ కెమేరా ద్వారా వస్తువును స్కాన్ చేస్తుంది. అంతేకాకుండా ఒక భాషను మరో భాషలోకి కూడా అనువాదం చేస్తుంది.

అంతేకాకుండా ఈ ఫోన్ లో ఏఆర్ ఎమోజీ ఫీచర్ ని పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా 2డీ చిత్రాలను.. 3డీలోకి మార్చుకోవచ్చు. ఈ ఫోన్ లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు ఇంటిలిజెంట్ స్కానర్ కూడా ఉంది. ఇది ఫోన్ యజమానిని వారి ఐరిస్, ఫేషియల్ స్కాన్ ద్వారా గుర్తించగలదు. ఇన్ని అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లు త్వరలోనే అన్ని రిటైల్ స్టోర్స్ లో లభ్యం కానున్నాయి.