శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్..అదీ మూడు కెమేరాలతో

Samsung officially announces the Galaxy J7 Duo
Highlights

శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ  శాంసంగ్.. మరో తాజా స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. అది కూడా బడ్జెట్ ధరలో. శాంసంగ్ గెలాక్సీ జే7 డ్యూ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.16,990గా ప్రకటించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వచ్చిన తమ తొలి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని శాంసంగ్‌ ప్రకటించింది. 13 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్‌ షూటర్‌ 8 మెగాపిక్సెల్‌గా ఉంది. నలుపు రంగు ఆప్షన్‌లో ఇది మార్కెట్‌లో లభ్యమవుతుంది.

గెలాక్సీ జే7 డ్యూ ఫీచర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ డిస్‌ప్లే
1.6గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఫిజికల్‌ హోమ్‌ బటన్‌ వద్ద ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

loader