ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సామ్ సంగ్.. సీఈఎస్( కన్ జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) కోసం పూర్తి స్థాయిలో సిద్ధమౌతోంది. వచ్చే వారంలో సీఈఎస్2018 కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా.. ఈ ప్రదర్శనలో సామ్ సంగ్.. ఓ కొత్త ల్యాప్ టాప్ ని ప్రదర్శించనుంది. సామ్ సంగ్ నోట్ బుక్ 7 స్పిన్ పేరిట ఈ ల్యాప్ టాప్ ని ప్రవేశపెడుతోంది. ఇది మల్టీ ఫంక్షనల్ ల్యాప్ టాప్ ని కంపెనీ తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన నోట్ బుక్ 7కి అప్ డేటేడ్ వర్షన్ గా దీనిని విడుదల చేసినట్లు తెలిపారు.

ఈ ల్యాప్ టాప్ కోసం ప్రత్యేకంగా యాక్టివ్ పెన్ ని కూడా తయారు చేశారు. కాకపోతే.. ఆ పెన్ ని విడిగా కొనుగోలు చేయాల్సిందే. ఈ ల్యాప్ టాప్ 360 డిగ్రీల్లో ఎటువైపు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. అంతేకాదు.. ఇది టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్. అన్ని రకాల వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథెంటికేషన్ కూడా ఉంది. ధర మాత్రం ప్రకటించలేదు.

సామ్ సంగ్ నోట్ బుక్ 7 స్పిన్ ఫీచర్లు..

13.3 ఇంచెస్ డిస్ప్లే

8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్

8జీబీర్యామ్

256జీబీ స్టోరేజీ

బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే