ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్  అమెజాన్  ఇండియా శాంసంగ్‌ హ్యాపీ అవర్స్  సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో భాగంగా,  శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ రేంజ్   స్మార్ట్‌ ఫోన్లపై  డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్‌, నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ అందిస్తోంది. గెలాక్సీ ఎ8 + ఫోన్ పై  2వేల రూపాయలు  డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి తోడు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు 1,500 రూపాయల క్యాష్ బ్యాక్‌ కూడా అందించనుంది. అయితే ఈఎంఐ ఆఫర్‌ ఎంచుకున్న  వినియోగదారులకు  ఈ ఆఫర్ చెల్లదు. గెలాక్సీ ఆన్7 ప్రైమ్  స్మార్ట్‌ ఫోన్‌  డిస్కౌంట్ సేల్ లో రూ.12,990కే అందుబాటులో ఉంది.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు  శాంసంగ్‌ గెలాక్సీ ఆన్ 5 ప్రో పై వెయ్యి రూపాయిలు,  ఆన్ 7  ప్రో పై రూ.2వేలు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ  డిస్కౌంట్ తరువాత, ఆన్‌ 5 ప్రో రూ .6,990,  ఆన్‌​ 7 ప్రో రూ .7,490కే లభిస్తున్నాయి. అంతేకాకుండా హ్యాపీ అవర్స్‌ సేల్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు కూడా ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ జె2, గెలాక్సీ జె7 ప్రో, గెలాక్సీ జె7 ప్రైమ్,  గెలాక్సీ జె5 ప్రైమ్ లాంటి గెలాక్సీ జెసిరీస్ స్మార్ట్‌ ఫోన్ల కొనుగోళ్లపై రూ. 1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ తరువాత వీటి ధరలు  వరుసగా రూ. 5,490, రూ.18,400, రూ. 12,400, రూ.10,490లకే లభ్యం కానున్నాయి.