భారీ ఆఫర్లు.. రెండు గంటలే సమయం

First Published 12, Dec 2017, 11:45 AM IST
Samsung Happy Hours Sale Offers on Galaxy On5 Pro Galaxy On7 Pro
Highlights
  • డిసెంబర్‌ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు  మాత్రమే ఈ సేల్‌  ఉంటుంది.

స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం సామ్ సంగ్‌  'హ్యాపీ అవర్స్‌' సేల్‌కు తెరతీస్తోంది. అమెజాన్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై డిసెంబర్‌ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతుంది. ఈ సేల్‌లో భాగంగా సామ్ సంగ్‌ గెలాక్సీ ఆన్‌5 ప్రొ, గెలాక్సీ ఆన్‌7 ప్రొ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. అదనంగా మొబైల్స్‌ పై రూ.6,700 వరకు తగ్గింపును అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. . అమెజాన్‌లో సామ్ సంగ్‌ గెలాక్సీ సీ9 ప్రొ(6జీబీ) ధర రూ.29,900గా ఉంది. ఈ ఫోన్‌ అసలు ధర 34వేల రూపాయలు. అంటే 12 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అదేవిధంగా గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.27,700 నుంచి రూ.20,990కి తగ్గింది. సామ్ సంగ్‌ గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ ఫోన్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.17,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ.24,500.

సామ్ సంగ్‌ ఆన్‌8 స్మార్ట్‌ ఫోన్‌ కూడా 14 శాతం తగ్గింపుతో రూ.11,590కి లిస్టు అయింది. గెలాక్సీ జే5(2016) స్మార్ట్‌ ఫోన్‌ను రూ.10,990కి బదులు రూ.9,190కు కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా సామ్ సంగ్‌ తాజాగా తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 8 రూ.67,900కి దిగొచ్చింది. అటు క్రిస్మస్‌ కార్నివల్‌ సేల్‌ను కూడా సామ్ సంగ్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌ డిసెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరుపుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్ససరీస్‌, వేరబుల్‌ డివైజ్‌లు, టెలివిజన్లపై డీల్స్‌ ను అందిస్తోంది. అన్ని ఆర్డర్లపై కంపెనీ ఉచితంగా డెలివరీ చేస్తోంది.  


 

loader