ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు ఈరోజు(మంగళవారం) భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇటీవల బార్సిలోనాలో ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్2018’ ప్రదర్శన జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిలో శాంసంగ్.. గెలాక్సీఎస్9, గెలాక్సీ ఎస్9+ పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఈ రోజు మన మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ సందర్భంగా వీటి ధరలను కూడా కంపెనీ ప్రకటించింది.

ఈ రెండు ఫోన్లు 64జీబీ, 256జీబీ రెండు వేరియంట్లలో లభ్యమౌతున్నాయి. 64జీబీ సామర్థ్యం గల గెలాక్సీ ఎస్9 ఫోన్ ధర రూ.62,500, 256జీబీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.71,000గా ప్రకటించారు. ఇక 64జీబీ సామర్థ్యం గల గెలాక్సీ ఎస్9+ ఫోన్ ధర రూ.70,000, 256జీబీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.79వేలుగా ప్రకటించారు. మంగళవారం ఈ ఫోన్ల ప్రీబుకింగ్  ప్రారంభం అవుతోంది. ప్రీబుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ.2వేలు అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎస్9 ఫీచర్లు..

5.8 ఇంచెస్ క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ/256జీబీ సామర్థ్యం, 12మెగాపిక్సెల్ వెనుక కెమేరా, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్

గెలాక్సీ ఎస్9+ ఫీచర్లు..

6.2 ఇంచెస్ క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 64జీబీ/256జీబీ సామర్థ్యం, 12మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్