శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు

Samsung Galaxy S8, Galaxy S8+ Price in India Slashed Following Galaxy S9 Series Launch
Highlights

భారీ తగ్గింపు

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్.. మరోసారి తమ కంపెనీ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. శాంసంగ్ గతేడాది ఏప్రిల్ లో గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ల ప్రారంభ ధరలు రూ.57,900, రూ.64,900గా ఉండేవి. అయితే ఇప్పుడు వీటి ధరలను శాంసంగ్ భారీగా తగ్గించింది. దీంతో గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లు వరుసగా రూ.49,990, రూ.53,990 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. గెలాక్సీ ఎస్8 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.64,900 ధరకు లభిస్తున్నది. ఇక పేటీఎంలో ఈ ఫోన్లను కొంటే తగ్గింపు ధరతోపాటు రూ.10వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇటీవలే గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లను విడుదల చేసిన సందర్భంగా గెలాక్సీ ఎస్8 ఫోన్ల ధరలను తగ్గించినట్టు శాంసంగ్ వెల్లడించింది.

loader