భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ధర

First Published 11, Feb 2018, 10:01 AM IST
samsung  galaxy s7 price cut in india
Highlights
  • శాంసంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. 2016 మార్చిలో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రస్తుతం రూ.25,910 తగ్గింపుకు అందిస్తోంది. ఫోన్ మొదట విడుదల చేసిన సమయంలో ఫోన్ ధర రూ.48,900గా ఉండగా  ఇప్పుడు రూ.22,990కే లభిస్తోంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ జరుపుతున్న శాంసంగ్‌ కార్నివల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై భారీ మొత్తంలో డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫోన్ విడుదలైన సమయంలో.. గెలాక్సీ ఎస్7 హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కాగా..  ఇప్పుడు ధర తగ్గించి మరోసారి అమ్మకాలు మొదలుపెట్టింది.

గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ఫోన్‌కు 5.1 అంగుళాల డిస్‌ప్లే, 1440x2560 పిక్సెల్స్‌ రెజుల్యూషన్‌, ఎక్సీనోస్‌ 8890 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ నోగట్‌కు అప్‌గ్రేడెడ్‌, 4జీ ఎల్‌టీసీ కనెక్టివిటీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 

loader