హైఎండ్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ ఫోన్ ధర తగ్గింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.6వేలు తగ్గిస్తున్నట్లు కంపెపీ ప్రకటించింది. ధర తగ్గింపు అనంతరం  గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ 32జీబీ వేరియంట్‌ రూ.35,900కు, 128జీబీ వెర్షన్‌ రూ.37,900కు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్‌ ఛానల్స్‌ లో మాత్రమే ఈ తగ్గింపుతో గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ ను కొనుగోలు చేసుకోవచ్చు. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కేవలం 32జీబీ వేరియంట్‌పై మాత్రమే ధర తగ్గింది. 128జీబీ వేరియంట్‌ పాత ధరకే లభ్యమవుతోంది. 

 2016 ఆగస్టులో ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఫోన్ విడుదల సమయంలో 32జీబీ వేరియంట్‌ ధర 50,900 రూపాయలు, 128జీబీ వేరియంట్‌ ధర 56,900 రూపాయలు ఉంది. అనంతరం ఈ రెండు వేరియంట్లపై కూడా ధర తగ్గించి రూ.41,900కు, రూ.43,900కు శాంసంగ్‌ అందుబాటులోకి తెచ్చింది. మరోసారి ప్రస్తుతం వీటిపై ఆరు వేల రూపాయల మేర ధర తగ్గించింది.

శాంసంగ్ ఎస్7 గెలాక్సీ ఎడ్జ్ ఫోన్ ఫీచర్లు...

5.5 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1 నోగట్, 4జీబీ ర్యామ్, 12మెగాపిక్సెల్ వెనుక కెమేరా,5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం