ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శామ్ సంగ్.. అతి తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ పేరిట ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు భారత్ లో ప్రారంభం కానున్నాయి. అమేజాన్ ఇండియా, శామ్ సంగ్ రీటైల్ స్టోర్స్ లో ఫోన్ లభ్యమౌతుందని కంపెనీ తెలిపింది. ఫ్రంట్, బ్యాక్ కెమేరాలు రెండూ 13 మెగా పిక్సెల్ తో అందిస్తున్నట్లు చెప్పింది. దీని ప్రారంభ ధర రూ.12,990గా ప్రకటించింది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్బుల్ట్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.12,990గానూ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్బుల్ట్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.14,990గా ప్రకటించారు. గోల్డ్, బ్లాక్ కలర్స్ లో లభ్యం కానుంది.

 

శామ్ సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ ఫీచర్లు..

5.50 ఇంచెస్ డిస్ ప్లే

1.6గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

13మెగా పిక్సెల్ వెనుక కెమేరా

1080*1920 పిక్సెల్స్ రెసల్యూషన్

32జీబీ స్టోరేజీ/64జీబీ స్టోరేజీ

3జీబీ ర్యామ్ /4జీబీ ర్యామ్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్

3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం