శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ధరల తగ్గింపు

First Published 22, Feb 2018, 11:42 AM IST
Samsung Galaxy J2 Pro Galaxy J2 Price in India Slashed
Highlights
  • గెలాక్సీ ఫోన్లపై ధరలు తగ్గించిన శాంసంగ్

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కంపెనీకి చెందిన గెలాక్సీ జే2, గెలాక్సీ జే2 ప్రో ఫోన్లపై ధరలను తగ్గించింది. తగ్గింపు అనంతరం గెలాక్సీ జే2 ప్రొ 7,690 రూపాయలకు, గెలాక్సీ జే2(2017) 6,590 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ధరలు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌  అన్నింటిలో  అందుబాటులో ఉంటాయని శాంసంగ్ ప్రకటించింది. గెలాక్సీ జే2 ప్రొ 2016 జూలైలో మార్కెట్లోకి వచ్చింది. తొలిసారి విడుదల చేసిన సమయంలో దాని ధర రూ.9,890. కాగా గెలాక్సీ జే2గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు దాని ధర రూ.7,390గా ప్రకటించారు.

 ఇటీవల భారత మొబైల్ ఫోన్స్ మార్కెట్లో.. షియోమి తొలిస్థానం సంపాదించగా.. శాంసంగ్ రెండో స్థానానికి పడిపోయింది. దీంతో తిరిగి తన స్థానాన్ని దక్కించుకునేందుకు శాంసంగ్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్ ధరలను తగ్గించి.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

గెలాక్సీ జే2 ప్రో ఫీచర్లు..

5ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే

1.5గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

2జీబీ ర్యామ్

8మెగాపిక్సెల్ వెనుక కెమేరా

5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

16జీబీ స్టోరేజ్ సామర్థ్యం

128జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ

2600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్

గెలాక్సీ జే2 ఫీచర్లు..

4.7ఇంచెస్ క్యూ హెచ్ డీ డిస్ ప్లే

1.3గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

1జీబీ ర్యామ్

5మెగాపిక్సెల్ వెనుక కెమేరా

5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

8జీబీ స్టోరేజ్ సామర్థ్యం

128జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ

2000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్

loader