శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై మరోసారి భారీ తగ్గింపు

Samsung Carnival on Flipkart: Discounts on Galaxy On Nxt, On Max, On5 and more mobiles
Highlights

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ కార్నివాల్

శాంసంగ్ సంస్థ మరోసారి తన గెలాక్సీ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్పెషల్ గా ‘ శాంసంగ్ కార్నివాల్’ ను ప్రారంభించింది.శాంసంగ్‌ ఉత్పత్తులు స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, మైక్రోవేవ్‌, ఓవెన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, రేపటి వరకు జరుగనుంది.

ఆఫర్లు ఇలా ఉన్నాయి..
గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌ 4జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.16,900 నుంచి రూ.12,900కు తగ్గింపు,గెలాక్సీ ఆన్‌5 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,990 నుంచి రూ.5,990కు తగ్గింది,గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.9,499కే అందుబాటు,గెలాక్సీ జే3 ప్రొ 2జీబీ/16జీబీ వేరియంట్‌ రూ.6,990కే లభిస్తోంది, ఈ ఫోన్‌ అసలు ధర రూ.8,490.గెలాక్సీ జే7 ఎడ్జ్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.34,990కు కొనుగోలు చేసుకోవచ్చు,గెలాక్సీ జే7 ప్రొ ధర రూ.18,900 గెలాక్సీ జే7 రూ.13,800కు అందుబాటులో ఉంచారు.

స్మార్ట్‌ఫోన్లతోనే కాకుండా.. శాంసంగ్‌ ఇతర ప్రొడక్ట్‌లపై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. శాంసంగ్‌ 32 అంగుళాల హెడ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీ ఈ సేల్‌లో రూ.17,499కే అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్‌ ఫులీ ఆటోమేటిక్‌ 6.5 కేజీల వాషింగ్‌ మిషన్‌ ధర ఎక్స్చేంజ్‌లో రూ.2500 వరకు తగ్గి, రూ.15,999కి విక్రయానికి వచ్చింది. రూ.13,972 నుంచి శాంసంగ్‌ రూమ్‌ ఎయిర్‌ ప్యూరిఫైర్స్‌ ధర ప్రారంభమైంది. మైక్రోవేవ్స్‌ రూ.5,999కు అందుబాటులో వచ్చాయి. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీసం కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతు విధించింది.
 

loader