సల్మాన్ కి బెయిల్

Salman Khan blackbuck poaching case LIVE updates: Actor granted bail on surety of Rs 50,000
Highlights

రూ.50 వేల పూచీకత్తుతో బెయిలు మంజూరు చేసిన కోర్టు

సల్మాన్‌ ఖాన్‌  కి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.50వేల పూచీ కత్తుతో ఆయనకు బెయిలు మంజూరు చేశారు.  సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆయన ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు. తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
 

రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే ఉన్నారు.

loader