(వీడియో)ఎమ్మెల్యే ఇంట్లో సాక్షి పత్రిక ప్రతుల దగ్ధం

sakshi newspaper burnt at TDP MLAs residence
Highlights

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  క్యాంపు కార్యాలయం లో ఈ సాయంకాలం సాక్షి దినపత్రిక ప్రతులను  తగలు పెట్టిన తెదేపా నేతలు , వారి అనుచర రైతులు  పత్రిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.  గోదావరి డెల్టాకి నీళ్లు    లేవు..కృష్ణా డెల్టా నీళ్లుంటు  సాక్షి పేపర్ వచ్చిన కధనానికి ఇది నిరసన అని రైతులు చెప్పారు.

 

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ విజయవాడ క్యాంపు కార్యాలయం లో ఈ సాయంకాలం సాక్షి దినపత్రిక ప్రతులను  తగలు పెట్టిన తెదేపా నేతలు ,రైతులు  పత్రిక మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. 

                       
 గోదావరి డెల్టాకి నీళ్లు    లేవు..కృష్ణా డెల్టా నీళ్లుంటు  సాక్షి పేపర్ వచ్చిన కధనానికి అందోళన చెందిన రైతులు ఇలా నిరసన కార్యక్రమం ఏర్పాటుచేశారు. 

                   
 వైయస్ జగన్ కుట్రపూరితంగా లేనిపోని అపోహాలు సృష్టించిన గోదావరి ,కృష్ణా రైతులు విద్వేశాలు రెచ్చగొడుతున్నారని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే వంశీ మోహన్ విమర్శించారు.         

      
గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు పట్టిసీమ ద్వారా నీళ్లు అందించి పంటని కాపాడింది తెదేపా ప్రభుత్వం కాదా అని  ఎమ్మెల్యే వంశీ  ప్రశ్నించారు.

                      
 పోలవరం, పట్టిసీమని వ్యతిరేకించిన ప్రతిపక్ష  వైకాపాకి రైతులు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని  ఎమ్మెల్యే వంశీ అన్నారు.

loader